
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి సోమవారం విజయవాడలో తన బాధ్యతలు స్వీకరించాడు. ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అని, రాగద్వేషాలకు అతీతంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందని నిమ్మగడ్డ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తమ విధుల నిర్వహణలో ఎస్ ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సహకారం లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు. గతంలో లాగే ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుందనుకుంటున్నట్లు చెప్పారు.