డిపాజిట్ల పేరుతో రూ.200 కోట్లు కుచ్చుటోపి పెట్టిన కేసులో ప్రధాన నిందితురాలు తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ (TSCAB ) నిమ్మగడ్డ వాణి బాలని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె భర్త మెకా నేతాజీతో పాటు అతని కుమారుడు శ్రీ హర్షను అరెస్ట్ చేశారు.
శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ పేరుతో అబిడ్స్ లోని తెలంగాణ స్టేట్ కోఆపారేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణి బాల సుమారు 517 మంది నుంచి రూ.200 కోట్ల వరకు వసూలు చేసింది. ఆమె భర్త మేక నేతాజీ, కొడుకు మేక శ్రీహర్షలు డిపాజిట్ల సేకరణ చేశారు. నెలకు 24 శాతం రిటర్న్స్ ఇస్తామని నమ్మబలికారు మేకా ఫ్యామిలీ.మొత్తం 532 మంది నుంచి డిపాజిట్లు వసూలు చేసి ఆ డబ్బులు తీసుకొని పరార్ అయ్యారు. దీంతో వాణి బాలని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తమకు న్యాయం చేయాలని బషీర్ బాగ్ లోని హైదరాబాద్ సీసీస్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. వాణి బాల చిట్ ఫండ్ కంపెనీ శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ పైన సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు 200 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించారు. ప్రధాన నిందితురాలు నిమ్మగడ్డ వాణిబాలతో పాటు ఆమె భర్త, కొడుకును అరెస్ట్ చేశారు.