పంజాగుట్ట, వెలుగు: నిమ్స్హాస్పిటల్ యాజమాన్యం ఆరు నెలలుగా మందుల బిల్లులు చెల్లించడం లేదని డీలర్లు వాపోతున్నారు. దాదాపు 40 మందికి భారీ మొత్తంలో బిల్లులు రావాల్సి ఉందని చెబుతున్నారు.
మందుల కంపెనీలకు డబ్బు కట్టేందుకు అప్పులు చేస్తున్నామని, ఇప్పటికైనా హాస్పిటల్ యాజమాన్యం స్పందించి బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు. ఈ విషయంపై మంగళవారం ఆసుపత్రి వర్గాలను అడగగా సరైన సమాధానం చెప్పకుండా దాటవేశారు.