నిమ్స్ హాస్పిటల్లో పలువురు ఉద్యోగులు మంగళవారం ( డిసెంబర్ 31, 2024 ) పదవీ విరమణ చేశారు. ఈ సందర్బంగా హాస్పిటల్లోని లెర్నింగ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్యోగులను ఘనంగా సత్కరించి, వారు ఆసుపత్రికి అందించిన సేవల్ని కొనియాడారు ఆసుపత్రి డైరెక్టర్ నగరి భీరప్ప.
పదవీ విరమణ పొందుతున్న వారిలో సీనియర్ అసిస్టెంట్ శ్రీమతి యమ్.అరుణ,ప్లంబర్ గులాం వారీస్ వార్సీ ఉన్నారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ డా. శాంతివీర్, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డా. లక్ష్మి భాస్కర్, వివిధ ఉద్యోగుల సంఘ నాయకులు , ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని పదవీ విరమణ చేస్తున్నటువంటి తోటి ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.