
హైదరాబాద్ లోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ మేనేజ్ మెంట్ పీజీ కోర్సును ఆఫర్ చేస్తుంది. ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 26వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది రెండు సంవత్సరాల కోర్సు. తర్వాత 6 నెలల పాటు నిమ్స్‌లోనే ఇంటర్న్ షిప్ ఉంటుంది. మొత్తం 20 సీట్లు. ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా సెలెక్షన్స్ జరుగుతాయి.
బీఏ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ, బీటెక్ .. ఇలా ఏ డిగ్రీ చేసినా హాస్పిటల్ రంగంలో కెరీర్ ప్రారంభించే అవకాశంను హైదరాబాద్ లోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) కల్పిస్తోంది. ఇందుకు గాను రెండేళ్ల వ్యవధి గల మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్ మెంట్ (ఎంహెచ్ఎం) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో ఎన్నో ప్రైవేటు వర్శిటీలు, కాలేజీలు ఈ కోర్సును అందిస్తుండగా ఫస్ట్ టైం ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిమ్స్ ఈ కోర్సును ఆఫర్ చేస్తుండడం విశేషం.
సీట్లు : 20
కాలవ్యవధి: 2 సంవత్సరాలు + 6 నెలలపాటు
నిమ్స్‌లోనే ఇంటర్న్‌షిప్ చేయాలి.
అర్హత: మెడికల్ /నాన్ మెడికల్ విభాగంలో
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 20 నుం చి 30 సంవత్సరాల మధ్య
ఉండాలి. (ఎస్సీ, ఎస్టీలకు 3 సంవత్సరాల
సడలింపు ఉంటుంది.)
అప్లై చేయండిలా..
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో రెండిం టిలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసేవారు హార్డ్ కాపీని నిమ్స్ బిల్డింగ్ లో స్వయంగా అందజేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్
సబ్జెక్టు మార్కులు
హెల్త్ రిలేటెడ్ 20
అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ 10
కంప్యూటర్ సైన్స్_10
జనరల్ నాలెడ్జ్ 10
ఐక్యూ 10
ఇంగ్లిష్ 10
మొత్తం 100
సెలక్షన్ ప్రాసెస్ : ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కుల పేపర్‌లో 70 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్, 30 మార్కులకు వైవా ఉంటుంది. అర్హులైన అభ్యర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం ఉంది. ఆపర్చునిటీస్కార్పొరేట్, ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్, ఫార్మా, ఇన్సూరె న్స్, రీసెర్చ్ డెవలప్‌మెం ట్, మెడికల్ టూరిజం సంస్థల్లో ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, అడ్మినిస్ట్రేషన్, మెయింటనెన్స్, బిల్డింగ్ ఇన్‌ఛార్జ్ , హాస్పిటల్ కోఆర్డినేటర్ వంటి జాబ్ ప్రొఫైల్స్ అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యతేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 2019 జూన్ 26
ఆఫ్ లైన్‌లో పంపేందుకు: 2019 జూన్ 28
ఎంట్రన్స్ టెస్ట్ తేది: 2019 జూలై 16
వెబ్ సైట్ : www.nims.edu.in