
పంజాగుట్ట,వెలుగు: నిమ్స్ ఆస్పత్రిలో తన తల్లికి మెరుగైన వైద్య సేవలు పొందిన వ్యక్తి రోగుల కోసం తనవంతు సహాయంగా 20 వీల్చైర్లను అందజేశాడు. నల్గొండకు చెందిన రాఘవేంద్ర రెడ్డి తల్లి జయప్రద గతంలో అనారోగ్యానికి గురైంది. నిమ్స్ వైద్యుల మెరుగైన వైద్య చికిత్సతో ఆమె తొందరగా కోలుకుంది. కృతజ్ఞతా భావంతో గురువారం 20 వీల్ చైర్లను తీసుకు వచ్చి అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌కు అందజేశారు.