హైదరాబాద్ లేడీస్ హాస్టల్ లో.. నల్గొండ జిల్లా యువతి ఆత్మహత్య

హైదరాబాద్ లేడీస్ హాస్టల్ లో.. నల్గొండ జిల్లా యువతి ఆత్మహత్య

క్షణికాఆవేశం.. తప్పుడు నిర్ణయంతో  ఓ యువతి జీవితాన్ని ముగించింది.  ఇంతకు ఏం జరిగిందంటే ప్రేమించినోడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఆత్మహత్య చేసుకుంది నల్లగొండ జిల్లాకు చెందిన మల్లేశ్వరి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కనుంతల పాడు గ్రామానికి చెందిన మల్లేశ్వరి హైదరాబాద్​నిమ్స్  హాస్పిటల్ లో స్టాఫ్ నర్స్ గా చేస్తూ..  దిల్ సుఖ్ నగర్ హాస్టల్ లో ఉంటుంది. అదే గ్రామానికి చెందిన జానారెడ్డి అనే యువకుడిని ప్రేమించింది.  కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో.. నెల రోజుల క్రితం  జానారెడ్డి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.  ఇక అంతే  మనస్థాపానికి గురైన మల్లేశ్వరి  హాస్టల్​ లో ఆత్మహత్య చేసుకుంది.  ఈ ఘటనకు ముందు మెసేజ్​ పెట్టి జానారెడ్డి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్​ లో తెలిపింది. 

మల్లీశ్వరి బాత్రూమ్​ లో అధికమోతాదులో మత్తు ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన మరణానికి తొమ్మిదిమంది కారణమని వారి పేర్లను తెలిపింది. సమాచారం అందుకున్న సరూర్​ నగర్​ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మల్లీశ్వరి తల్లిదండ్రుల పిర్యాదు మేరకు జానారెడ్డి ని సరూర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు  తరలించారు.