హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చిన్నపిల్లలకు ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ( నవంబర్ 1, 2024 ) నుండి నవంబర్ 9వ తేదీ వరకు స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. నిమ్స్ లోని ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ విభాగం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. శుక్రవారం ( నవంబర్ 1, 2024 ) ప్రారంభమైన ఈ శిబిరంలో బాలల దినోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన పిల్లలకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
చీలిక పెదవి, క్రానియోఫేషియల్ అనోమలీస్, పుట్టుకతో వచ్చే చేతి వైకల్యాలు, ప్రసూతి బ్రాచియల్ ప్లెక్సస్ గాయం (OBPI), పోస్ట్-బర్న్, పోస్ట్-ట్రామా వైకల్యాలు, వాస్కులర్ అనోమలీస్, 12-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలను ప్రభావితం చేసే ఇతర వైకల్యాల గురించి ఈ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు.ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఈ కార్యక్రమంలో ప్రాధాన్యత ఉంటుందని అధికారులు వెల్లడించారు.
తమ పిల్లలకు చికిత్స చేయించుకునే తల్లిదండ్రులు, సంరక్షకులు తప్పనిసరిగా ప్లాస్టిక్ సర్జరీ ఔట్ పేషెంట్ విభాగంలో నమోదు చేసుకోవాలని... స్క్రీనింగ్ క్యాంప్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు ఉంటుందని తెలిపారు అధికారులు.