
హైదరాబాద్, వెలుగు: నిమ్స్ హాస్పిటల్డాక్టర్లు అరుదైన సర్జరీని విజయవంతంగా పూర్తిచేశారు. ఓ పేషెంట్ వెన్నెముకలో స్టిమ్యులేటర్ సిస్టమ్‌ను అమర్చారు. నిమ్స్ సిబ్బంది అయిన అంజయ్యకు రెండున్నరేండ్ల కింద ఓ యాక్సిడెంట్ లో వెన్నెముక దెబ్బతిన్నది. నిమ్స్ న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ డాక్టర్లు రాడ్స్, స్క్రూలను అమర్చారు. యాక్సిండెంట్ అయినప్పటి నుంచి పెరాలసిస్‌తో రెండు కాళ్లతో నడవలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అంజయ్య వీల్ చైర్ కే పరిమితం అయ్యాడు.
దీంతో నిమ్స్ డాక్టర్లు అతని వెన్నెముకకు స్టిమ్యులేటర్ సిస్టమ్ అమర్చాలని నిర్ణయించారు. స్టిమ్యులేటర్ చాలా ఖరీదైనప్పటికీ న్యూరోసర్జన్లు ప్రొఫెసర్ సుచందా భట్టాచార్జి, రామనాథరెడ్డి, స్వప్న, అవినాశ్ టీమ్ తాజాగా స్టిమ్యులేటర్ సిస్టమ్ ను విజయవంతంగా అమర్చారు.
దీని ద్వారా విడుదలయ్యే ఎలక్ట్రిక్ పల్స్ మెడ, వీపు, కాళ్లు, చేతుల నొప్పులను తగ్గిస్తాయి. ఇప్పటివరకు సిటీలోని పది కార్పొరేట్ హాస్పిటల్స్ లో మాత్రమే ఇలాంటి సర్జరీలు జరిగాయని, రాష్ట్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మొదటిసారి నిమ్స్ లో చేశామని డైరెక్టర్ బీరప్ప తెలిపారు.