
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2023 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ కోర్సులో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది.
సబ్జెక్టులు: న్యూరాలజీ, మెడికల్ జెనెటిక్స్, పల్మనరీ మెడిసిన్, క్లినికల్ ఫార్మకాలజీ అండ్ థెరప్యూటిక్స్, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, నెఫ్రాలజీ, కార్డియాలజీ, మెడికల్ అంకాలజీ, అనస్థీషియాలజీ, ఇంటెన్సివ్ కేర్.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు స్క్రీనింగ్ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 9న పరీక్ష నిర్వహిస్తారు. వివరాలకు www.nims.edu.in వెబ్సైట్లో సంప్రదించాలి.