- హ్యాండ్ బ్రేక్ వేయని డ్రైవర్.. వెనక్కి వెళ్లి కారును ఢీకొని బోల్తా
- 9 మంది విద్యార్థులకు గాయాలు
శంషాబాద్, వెలుగు : స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పగా.. పలువురు విద్యార్థులు గాయపడిన ఘటన రాజేంద్రనగర్ పరిధిలో జరగింది. మైలార్ దేవ్ పల్లి పోలీసులు తెలిపిన ప్రకారం.. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు పయనీర్ కాన్సెప్ట్ స్కూలు ముగిసిన అనంతరం విద్యార్థులను ఎక్కించుకుని బస్సును నిలిపి డ్రైవర్ కిందికి దిగాడు. హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోవడంతో ఒక్కసారిగా వెనక్కు వెళ్లింది.
వెంటనే గమనించిన డ్రైవర్ పరిగెత్తి ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. క్యాబ్ ను(టీ ఎస్03యూబి0850)ని ఢీకొని బస్సు బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉండగా, వీరిలో 9 మంది గాయపడ్డారు. కారు ధ్వంసమైంది. స్థానికులు గాయపడ్డ చిన్నారులను స్థానికంగా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై తెలియడంతో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఆస్పత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. మైలార్ దేవ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.