ప్రతాప్‌గఢ్ : యూపీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడి, టెంపో వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్లో తొమ్మిది మంది మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. జిల్లా కేంద్రానికి 15 కిలో మీటర్ల దూరంలో లీలాపూర్ ఏరియాలో లక్నో – -వారణాసి హైవేపై సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నట్లు ఆ జిల్లా ఎస్పీ రోహిత్ మిశ్రా ప్రకటించారు. వ్యాన్‌లో ఉన్న మిగతా ప్రయాణికులను స్థానికులు రక్షించారని ఆయన తెలిపారు.
విషయం తెలిసిన వెంటనే పోలీసు టీం స్పాట్‌కు చేరుకుని గాయపడిన ఏడుగురిని ప్రతాప్‌గఢ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. అయితే, వారి పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో డాక్టర్లు ప్రయాగ్‌రాజ్ ఎస్‌ఆర్‌ఎన్ హాస్పిటల్‌కు రిఫర్ చేసినట్లు ఆయన తెలిపారు. కాగా, మృతులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. డెడ్‌బాడీలను పోస్టుమార్టం కోసం తరలించామని, కేసు ఫైల్చేసి ఎంక్వైరీ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.