కూల్ డ్రింక్ మూత మింగి తొమ్మిది నెలల బాబు మృతి

 కూల్ డ్రింక్ మూత మింగి తొమ్మిది నెలల బాబు మృతి

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ లోని ఉత్కూర్ లో విషాదం చోటుచేసుకుంది.  తొమ్మిది నెలల బాలుడు  కూల్ డ్రింక్ మూత మింగి మృతి చెందాడు. 

ఆసిఫాబాద్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న  సురేందర్  కుటుంబసమేతంగా మార్చి 9న లక్సెట్టిపేట్ మండలంలో కొమ్ముగూడెంలోని ఓ శుభ కార్యానికి హాజరయ్యారు. అక్కడ సురేందర్  కుమారుడు రుద్ర అయాన్ (9నెలలు)  ఆడుకుంటూ కూల్ డ్రింక్ మూత మింగాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడని తెలిపారు డాక్టర్లు.

బాబు మృతితో కుటుంబం విషాదంతో నిండిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.