యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుదగాని హరిశంకర్ గౌడ్ సూచించారు. బీజేపీ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా గురువారం యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రంలో మండల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడానికి శ్రమిస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి అందరూ అండగా నిలవాలని కోరారు.
ALSO READ : రాష్ట్రంలో వైద్య విప్లవం .. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నం: హరీశ్ రావు
గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని తొమ్మిదేళ్లలో బీజేపీ చేసి నిరూపించిందని తెలిపారు. బీఆర్ఎస్ పేరుతో కొత్త డ్రామా స్టార్ట్ చేసిన కేసీఆర్ కు ప్రజల చేతిలో భంగపాటు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు జెగ్గర్ల ఆనంద్ గౌడ్, సీనియర్ నాయకుడు తిరుమల కృష్ణ, ఎలబోయిన రవిశంకర్, మండల ప్రధాన కార్యదర్శి చీర గణేశ్, మండల ఉపాధ్యక్షుడు గులారి నర్సింహాగౌడ్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు వట్టిపల్లి గోపాల్, మహిళా మోర్చా అధ్యక్షురాలు ధనమ్మ, ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పాములపర్తి నరేశ్, ఎస్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ధీరావత్ తౌర్య, నియోజకవర్గ విస్తారక్ పులి శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు.