నిరుద్యోగులు అలర్ట్.. మాదాపూర్లో మరో సాఫ్ట్ వేర్ కంపెనీ ఘరానా మోసం

నిరుద్యోగులు అలర్ట్.. మాదాపూర్లో మరో సాఫ్ట్ వేర్ కంపెనీ  ఘరానా మోసం

హైదరాబాద్లో  ఉద్యోగాల పేరుతో మరో  సాఫ్ట్ వేర్  కంపెనీ బోర్డు తిప్పేసింది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను టార్గెట్ చేసిన నిర్వాహకులు లక్షలు దండుకుంటున్నారు. ఉద్యోగం వస్తుందనే ఆశతో  నిరుద్యోగులు కూడా  డబ్బులు కట్టడానికి వెనకడుగు వేయడం లేదు. ఇదే ఆసరగా తీసుకున్న నిర్వాహకులు  ఉద్యోగుల పేరుతో డబ్బులు దండుకోవడం..తర్వాత కొన్ని రోజులకే చేతులెత్తేయడం ఈ మధ్య కామన్ అయిపోయింది. 

 లేటెస్ట్ గా హైదరాబాద్ లోని  నియో సాఫ్ట్ వేర్  కంపెనీ పేరుతో చింతల్ కు చెందిన కాళ్ళ భార్గవ్ అనే వ్యక్తి 35 లక్షల వరకు  మోసం చేశాడు. బాధితుడు  లాలాగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు  చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టిన  పోలీసులు భార్గవ్ ను ఫిబ్రవరి 17న  అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.  కాళ్ల భార్గవ్ పేరుపై గతంలో జీడిమెట్ల, మాదాపూర్, కల్వకుర్తి పోలీస్ స్టేషన్లలో కేసులో నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.

Also Read :- రంజాన్కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

నిరుద్యోగుల్లారా తొందరపడకండి..ఉద్యోగం పేరుతో డబ్బులు వసూలు చేసే కంపెనీలను నమ్మకండి..డబ్బులు కట్టి మోసపోకండి అని పోలీసులు సూచిస్తున్నారు.