
- నిధులు నిలిపివేతపై ఎన్ఐఆర్ డీపీఆర్ ఉద్యోగులు నిరసన
ముషీరాబాద్, వెలుగు: జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ (ఎన్ఐఆర్ డీపీఆర్)కు నిధులు కేటాయించాలని ఆ సంస్థ ఉద్యోగులు ధర్నా చేశారు. కేంద్రం నిధుల నిలిపివేతను నిరసిస్తూ నేషనల్ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, అకాడమిక్ అసోసియేషన్, పెన్షనర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నిరసన తెలిపారు.
అసోసియేషన్ ప్రతినిధులు డి.రామకృష్ణ, సత్య పాలన్, ధీరజ్, రాజు సిన్హా, పరశురాం మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో పంచాయతీరాజ్ సంస్థ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. 65 ఏండ్లుగా ఈ సంస్థకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తోందని, అకస్మాత్తుగా నిధులు ఉపసంహరించుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో 1100 మంది పనిచేస్తున్నారని, ఉద్యోగ భద్రతకు హామీ ఇవ్వాలని కోరారు