నిర్భయను 2012లో కిరాతకంగా అత్యాచారం చేసి.. ఆమె చావుకు కారణమైన నిర్భయ దోషులు వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ థాకుర్, ముఖేష్ సింగ్‌లకు ఎట్టకేలకు శుక్రవారం ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ఉరి శిక్ష అమలయింది. జైలు అధికారులు నలుగురినీ ఒకేసారి ఉరి తీశారు. తీహార్ జైలులోని రూం నెంబర్ 3లో నలుగురు దోషులకు శిక్షను అమలు చేశారు. ఆ సమయంలో ఉరి కంబం దగ్గర 48 గార్డులు విధి నిర్వహణలో ఉన్నారు. అంటే ఒక్కోక్క దోషికి 12 మంది గార్డులను ఏర్పాటు చేశారు. దోషులను ఉరి తీయడానికి ముందు డాక్టర్ల చేత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం 4 గంటలకు నలుగురికీ అల్పాహారం ఇచ్చారు. అయితే ఉరి తీసే ముందు దోషి వినయ్ శర్మ బోరున విలపించాడు. కాగా.. నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయడం దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి. శిక్ష అమలు తర్వాత వైద్యులు దోషల మృతదేహాలను పరిశీలించి చనిపోయారని నిర్దారించారు. ఉదయం 8 గంటలకు వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఆ తర్వాత మృతదేహాలను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తారు. నిర్భయ తల్లిదండ్రులు ఇన్నాళ్లకు తమకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన 7 ఏళ్ల తర్వాత న్యాయం జరిగింది. తీహార్ జైలు బయట ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.
నిర్భయ దోషులకు ఉరి అమలు
- దేశం
- March 20, 2020
లేటెస్ట్
- తెలంగాణది ఓదారి, ఆ ఇద్దరు నేతలది ఇంకో దారి
- రేవంత్ పాలనపై ప్రజా తిరుగుబాటు : ఎమ్మెల్యే హరీశ్‌రావు
- కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎడ్యుకేషన్‌కు మంచి రోజులు
- పదేండ్లుగా దిశా మీటింగులు పెట్టరా : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- చేతితోనే తేమ చెకింగ్ .. ఖమ్మం మార్కెట్లో ట్రేడర్ల మాయాజాలం
- వాట్సాప్ పై నిషేధానికి నో..పిల్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- బైడెన్‌తో ట్రంప్ భేటీ
- స్టూడెంట్లతో సీఎం మాక్ అసెంబ్లీ
- సమ సమాజ మార్గదర్శి గురునానక్
- ఢిల్లీ మేయర్‌గా మహేశ్ ఖించీ
Most Read News
- Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎలా చేయాలి.. తల స్నానం ఎలా చేయాలి.. రాత్రి సమయంలో ఏం చేయాలి..
- Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు
- AUS vs IND: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ ఇద్దరే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించగలరు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన హైడ్రా కమిషనర్
- పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్‌న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు
- Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Happy Children's Day Special : ఈ పిండి వంటలు వండి పెట్టండి.. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..!
- Ranji Trophy 2024-25: ఏడాది తర్వాత రీ ఎంట్రీ.. బౌలింగ్‌లో నిప్పులు చెరిగిన షమీ
- కంగువ ఎఫెక్ట్ పుష్ప 2 పై పడిందా.? అందుకే తమన్ ని తీసుకున్నారా..?