నిర్భయ సామూహిక అత్యాచారం మరియు హత్య కేసుకు సంబంధించి నలుగురు దోషులు అక్షయ్ సింగ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్ సింగ్‌లకు శుక్రవారం తెల్లవారుజామున తీహార్ జైలులో ఉరిశిక్ష అమలు చేశారు. అయితే దోషులు నలుగురు ఉరితీయబడటానికి ముందు రాత్రంతా నిద్రపోలేదని జైలు అధికారులు తెలిపారు. గురువారం రాత్రి వరకు దోషులు తమ ఉరిశిక్ష వాయిదా పడుతుందనే ఆశతో ఉన్నారు. కానీ, అటు సుప్రీంకోర్టు, ఇటు హైకోర్టు రెండూ కూడా దోషుల ఉరిశిక్ష వాయిదాను నిరాకరించడంతో వారిలో చావు భయం కనిపించింది.
నిర్భయ దోషులు నలుగురు గురువారం రాత్రి తొందరగా నిద్రపోతామని జైలు అధికారులను కోరారు. కానీ.. వారు మాత్రం రాత్రంతా మేల్కొనే ఉన్నారు. అంతేకాకుండా.. దోషులంతా ఉదయం స్నానం చేస్తామని అధికారులను అడిగారు, కానీ.. వారిలో ఎవరూ స్నానం చేయలేదు. తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు దోషులందరికీ వైద్యపరీక్షలు నిర్వహించారు. తర్వాత వారందరికీ అల్పాహారం అందించారు. అయితే దోషులలో ఒకరు అల్పాహారం తినడానికి నిరాకరించారని ఒక అధికారి తెలిపారు.
For More News..