హైదరాబాద్ ఎన్ఐఆర్​డీపీఆర్లో ఉద్యోగాలు.. 33 పోస్టులున్నయ్..

హైదరాబాద్ ఎన్ఐఆర్​డీపీఆర్లో ఉద్యోగాలు.. 33 పోస్టులున్నయ్..

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి హైదరాబాద్ రాజేంద్రనగర్​లోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ రూరల్​ డెవలప్​మెంట్ ​అండ్​ పంచాయతీరాజ్​ నోటిఫికేషన్​ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 19వ తేదీ వరకు ఆన్ లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టులు 33: ప్రోగ్రామ్​ ఆఫీసర్ ​02, ప్రాజెక్ట్​ ఆఫీసర్ ​25, జూనియర్​ ప్రాజెక్ట్​ ఆఫీసర్​ 06.

ఎలిజిబిలిటీ: పోస్టులను అనుసరించి డిగ్రీ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), బీటెక్​( సివిల్, ఐటీ, సీఎస్ఈ), పీజీ (ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ, హెచ్ఆర్), ఎల్ఎల్ బీ, మాస్టర్​ డిగ్రీ(రూరల్​ మేనేజ్​మెంట్, సోషల్​ సైన్సెస్, డెవలప్​మెంట్​రిలేటెడ్ ఫీల్డ్) మాస్టర్స్​(ఫైనాన్స్, కామర్స్)లో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

అప్లికేషన్​: ఆన్​లైన్ ద్వారా.
లాస్ట్ ​డేట్: మార్చి 19.
సెలెక్షన్​ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.