కుటుంబ సర్వేను పకడ్బందీగా చేపట్టాలి

కుటుంబ సర్వేను పకడ్బందీగా చేపట్టాలి
  • అధికారులకు కలెక్టర్ల ఆదేశం

నెట్​వర్క్, వెలుగు: డిజిటల్ కుటుంబ సర్వేను ప‌క‌డ్బందీగా చేపట్టాలని నిర్మల్​కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ డిజిటల్ కార్డుల జారీ కోసం పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మల్ పట్టణం 42వ వార్డు(చింతకుంటవాడ)లో కొనసాగుతున్న ఇంటింటి సర్వేను శుక్రవారం ఆమె పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్న కల్యాణి, ము న్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా పీడీ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

 ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు, దస్నాపూర్ లో నిర్వహిస్తున్న డిజిటల్ కార్డు సర్వేను కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే పరిశీలించారు. కుటుంబ సభ్యుల వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలని ఆదేశించారు. ఇంటి యజమానురాలిగా మహిళ పేరు నమోదు చేసి తర్వాత కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయాలన్నారు. మరణించిన వారు, శాశ్వతంగా వెళ్లిపోయినవారి పేర్లను తొలగించాలని, జాబితాలో లేని వారి వివరాలు నమోదు చేయాలన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని 11వ వార్డు రాంనగర్ కాలనీలో నిర్వహించిన సర్వేను కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ అహ్మద్, అధికారులున్నారు.

సకాలంలో పూర్తి చేయాలి

ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్టు సర్వేను సకాలంలో పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని 16వ వార్డు అశోక్ రోడ్ లో నిర్వహిస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కాగజ్ నగర్ పట్టణంలోని ఓల్డ్ బస్తీలో కొనసాగుతున్న సర్వేను కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా మున్సిపల్ కమిషనర్ అంజయ్య, తహసీల్దార్ కిరణ్ తో కలిసి పరిశీలించారు.