ఎల్​ఆర్ఎస్​పై ప్రజలకు అవగాహన కల్పించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్ 

ఎల్​ఆర్ఎస్​పై ప్రజలకు అవగాహన కల్పించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్ 

ఖానాపూర్, వెలుగు: ఎల్ఆర్ఎస్​పై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం ఖానాపూర్ పట్టణంలోని ఎంపీపీ కార్యాలయంలో ఆమె స్థానిక మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ కు ఈ నెల 31 వరకు గడువు ఉన్నందున దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకొని 25 శాతం రాయితీ పొందాలని సూచించారు.

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.  వాగులు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ఇసుక రీచ్​ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అంతకుముందు ఎంపీపీ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న నమూనా ఇందిరమ్మ ఇంటిని కలెక్టర్ పరిశీలించారు. హౌసింగ్ పీడీ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ సుజాత రెడ్డి, ఎంపీడీవో సునీత, ఎంపీవో రత్నాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో ఇఫ్తార్

నిర్మల్, వెలుగు: కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం వేర్వేరుగా ఇఫ్తార్ విందులు నిర్వహించారు. ఇఫ్తార్​లో ము స్లిం ఉద్యోగులతోపాటు వ్యాపారులు, ఇతర రంగాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, అడిషనల్ ఎస్పీలు రాజేశ్ మీనా, ఉపేందర్ రెడ్డి, ఆర్డీవో రత్న కల్యాణి, డీపీవో శ్రీనివాస్, డీఎంహెచ్ వో రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.