టెన్త్ క్లాస్​లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

టెన్త్ క్లాస్​లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కుభీర్, వెలుగు : విద్యార్థులు కష్టపడి చదివి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లో 100శాతం ఉత్తీర్ణత సాధించాలని నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం కుభీర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులను సబ్జెక్టుల వారీగా ప్రశ్నలడిగి జవాబులు రాబట్టారు. కష్టపడి చదివి పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి తల్లిదండ్రులు, పాఠశాలకు మంచిపేరు తీసుకురావాలన్నారు.

ప్రతి సబ్జెక్ట్​లో విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని టీచర్ల సూచించారు. స్కూల్​లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డీఈఓ రవీందర్ ​రెడ్డిని ఆదేశించారు. అనంతరం కస్రా గ్రామంలోని నర్సరీని పరిశీలించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి విజయలక్ష్మి, పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీనివాస్,ఎమ్మార్వో సోము, ప్రిన్సిపాల్ వాణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.