ఎల్ఆర్ ఎస్ ఫీజు వసూలు పూర్తిచేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

ఎల్ఆర్ ఎస్ ఫీజు వసూలు పూర్తిచేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్(భీమారం), వెలుగు: ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని నిర్మల్ కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బుధవారం భీమారం మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్​ను సందర్శించారు. ఎల్ఆర్ఎస్ 2020 స్కీమ్​లో లే-అవుట్ లేని భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, అర్హత గల వారు ఫీజు చెల్లించి తమ భూములను క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు. ఫీజు చెల్లించేందుకు స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీల్లో ప్రజలందరికీ తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి 

నస్పూర్, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వార్డులు, ల్యాబ్, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఆస్పత్రులకు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అవసరమైన మందులను అందుబాటులో 
ఉంచుకోవాలన్నారు.