నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఊరట

  •     కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు స్టే

హైదరాబాద్, వెలుగు : ఆరోగ్య కార్యకర్తల వేతనాల చెల్లింపులకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో నిర్మల్ కలెక్టర్ మహమ్మద్ ముషారఫ్ ఫరూఖి, మున్సిపల్ కమిషనర్ ఎ. సంపత్ కుమార్ కు గురువారం హైకోర్టులో ఊరట లభించింది. ఆరోగ్య కార్యకర్తలకు 15 రోజ్రుల్లో వేతనాలు చెల్లించాలని సింగిల్ జడ్జి గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను 15 రోజుల్లో అమలు చేయని పక్షంలో నిర్మల్ కలెక్టర్ కు నెల రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా, మున్సిపల్ కమిషనర్ కు 15 రోజుల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కలెక్టర్ దాఖలు చేసిన అప్పీలుపై జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీలో 44 మంది ఆరోగ్య కార్యకర్తలను కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియమించారు. ఆ నియామకం జరిగి. ఆరు నెలలైనా వివిధ కారణాలతో వేతనాలు చెల్లించకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో  వేతనాలు చెల్లించాలంటూ 2022 సెప్టెంబరులో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలను అమలు చేయకపోవడంతో సయ్యద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షకీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరో 27 మంది వేర్వేరుగా రెండు కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు దాఖలు చేశారు. వీటిని సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడ్జి  విచారించారు. కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థాయి వ్యక్తి కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోగా వాస్తవాలను వక్రీకరించి అఫిడవిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయడం కోర్టు ధిక్కరణేనని తేల్చి చెప్పారు. చివరి అవకాశంగా వేతనాలు చెల్లించడానికి కలెక్టర్, మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 15 రోజులు గడువు ఇస్తూ మే 3న ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ 15 రోజుల్లో వేతనాలు చెల్లించని పక్షంలో కోర్టు ధిక్కరణకు పాల్పడిన కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నెల రోజులు, కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 15 రోజుల జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని తీర్పు వెలువరించారు. దీనిపై కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్పీలు దాఖలు చేయగా హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసులో విధించిన శిక్షపై  స్టే విధించింది.