నిర్మల్, వెలుగు: నిర్మల్ నియోజకవర్గం మామడ మండల జడ్పీటీసీ సోనియా బీజేపీకి గుడ్‌బై చెప్పారు. సోనియాతోపాటు ఆమె భర్త సంతోష్, మరి కొంతమంది కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. వారికి డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా శ్రీహరి రావు మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్లపై ప్రజలు నమ్మకం కోల్పోయారన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి రాబోతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే పనిచేస్తుందన్నారు.