
నిర్మల్ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి సంచలన తీర్పు వెలువరించారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు(SRSP), గడ్డెన్న వాగు పరిహారం చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంపై నిర్మల్ కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీసులను స్వాధీనం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ తీర్పిచ్చారు.
గడ్డెన్న వాగు, శ్రీరాంసాగర్ జలాశయంలో భూములు కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. బాధితులకు ఆ పరిహారం చెల్లించడంలో కలెక్టర్ ఆఫీస్, ఆర్డీవో కార్యాలయం అధికారులు జాప్యం చేస్తున్నారు. ఈ క్రమంలో బాధితులు కోర్టును ఆశ్రయించడంతో విచారించిన న్యాయస్థానం.. కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయం స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.