
నిర్మల్, వెలుగు: సీఎంఆర్ అవకతవకలపై సర్కార్ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ నిర్మల్ జిల్లా పౌరసరఫరాల శాఖ ఆఫీసర్ఎస్కే మహమూద్ అలీని సస్పెండ్ చేసింది. ఈయనతోపాటు డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ బాబును కూడా సస్పెండ్ చేశారు. 2022, 23 సంవత్సరానికి లక్షా 58 వేల 566 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనగా ఇందులో లక్షా 6 వేల 831 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి ఉంది. ఇప్పటివరకు 4వేల 97 మెట్రిక్ టన్నులు మాత్రమే మిల్లర్లు అప్పజెప్పారు. 2023, 24 ఖరీఫ్ కు సంబంధించి లక్షా 42 వేల 759 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా 95 వేల 648 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం ఇవ్వాల్సి ఉంది.