![ఒకే రోజు 5,940 ఇంకుడు గుంతల నిర్మాణం.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు నామినేట్](https://static.v6velugu.com/uploads/2023/08/Nirmal-district-has-been-nominated_lFITwqzhuf.jpg)
నిర్మల్, వెలుగు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఒకేరోజు 5 వేల 940 ఇంకుడు గుంతలను నిర్మించి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు నిర్మల్ జిల్లా నామినేట్అయ్యింది. వర్షపు బొట్టు.. ఒడిసి పట్టు, రూఫ్ టాప్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ పేరిట చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, పీడీ విజయలక్ష్మి ప్రారంభించారు. జిల్లాలోని 396 గ్రామాలు 18 బ్లాక్ ల్లో ఉపాధి హామీ సిబ్బందితోపాటు ఐకేపీ, ఐసీడీఎస్ ఫీల్డ్ స్టాఫ్, డీఆర్డీఏ, పంచాయతీరాజ్ శాఖల సిబ్బంది ఈ ఇంకుడు గుంతల నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చాలెంజింగ్‌గా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని వర్చువల్ పద్ధతిలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు పరిశీలించారు. కొద్ది రోజుల్లోనే ఈ సంస్థ ప్రతినిధులు నిర్మల్ జిల్లాకు వచ్చి ఇంకుడు గుంతలను స్వయంగా పరిశీలించనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఇంకుడు గుంతలు నిర్మించినట్లు పీడీ విజయలక్ష్మి తెలిపారు.