
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడెం మండలం బెల్లాల్ వద్ద ఓ బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు సయ్యద్ సమీ(18), మహమ్మద్ జిహాన్(18) కు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు నిర్మల్ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో సయ్యద్ సమీ మృతి చెందాడు. మరో యువకుడు ఆసుత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు యువకులు కడెం మండలానికి చెందిన వారిగా గుర్తించారు.