![నిర్మల్ జిల్లాలో అట్టహాసంగా తైక్వాండో పోటీలు](https://static.v6velugu.com/uploads/2025/02/nirmal-district-library-chairman-arjumand-organized-taekwondo-belt-promotion-test-competition_uIWiMOt3d4.jpg)
నిర్మల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ఎంతగానో ప్రోత్సహిస్తోందని నిర్మల్ జిల్లా లైబ్రరీ చైర్మన్ అర్జుమంద్ అన్నారు. సోమవారం ది నిర్మల్ జిల్లా టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో టైక్వాండో బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను అర్జుమంద్ తోపాటు మేడిపల్లి భీం రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఏకేఎస్ అకాడమీ కోచ్ మాస్టర్ దాయత్ అక్షయ్ ప్రారంభించారు.
అర్జుమంద్ మాట్లాడుతూ నిర్మల్ లో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వపరంగా క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం అందుతోందన్నారు. అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వాహజ్ అలీ, గ్రాండ్ మాస్టర్స్ సంపూర్ణం, నాగరాజు, టైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డి.సోమేశ్ తదితరులు పాల్గొన్నారు.