ఎస్​ఐపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం

ఎస్​ఐపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం
  • ఎస్పీకి ఫిర్యాదు చేసిన పోలీస్ అధికారుల సంఘం

నిర్మల్, వెలుగు: విధి నిర్వహణలో ఉన్న బాసర ఎస్​ఐపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని,  దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవా లని నిర్మల్ జిల్లా పోలీసు అధికారుల సంఘం బాధ్యులు కోరారు. మంగళవారం ఎస్పీ జానకి షర్మిలకు వినతిపత్రం అందించారు. బాసర ట్రిపుల్ ఐటీలో సూసైడ్ చేసుకున్న స్టూడెంట్ ను అక్కడి అధికారుల అభ్యర్థన మేరకు భైంసా ప్రభుత్వ హాస్పిటల్ తీసుకువెళ్లిన ఎస్​ఐపై మృతురాలి తల్లి దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. స్టూడెంట్ మరణానికి ఎస్​ఐ కారణమని తిట్టడమే కాకుండా కొట్టడం సమంజసం కాదన్నారు. 

బిడ్డను కోల్పోయిన తల్లి బాధను తాము అర్థం చేసుకోగలమని, కానీ అంకితభావంతో పనిచేసే తమపై ఆరోపణలు చేస్తూ దాడికి పాల్పడడం తమ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీసులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తుంటే.. ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తూ దాడి చేయడం సరికాదన్నారు. ఎస్​ఐపై దాడి చేసిన స్టూడెంట్ తల్లి ఉజ్వలపై చర్యలు తీసుకోవాలని కోరారు.