
నిర్మల్, వెలుగు: కొత్త టెక్నాలజీతో జిల్లాలో ట్రాఫిక్ కంట్రోల్ సిస్టంను అమలు చేయబోతున్నట్లు నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. మంగళవారం డీపీవో ఆఫీస్‌లో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలకు ఎస్పీ ట్రాఫిక్ కంట్రోల్ పరికరాలను పంపిణీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిం
చేలా కొత్త పరికరాలు ఉపయోగపడతాయ న్నారు.
ఇప్పటికే సీసీ కెమెరాల ద్వారా నిర్మల్ పట్టణంలోని ప్రధాన కూడల్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణ కొనసాగిస్తున్నామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను మరింత పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. నేరాల నియంత్రణకు మరింత కృషి చేయాలని సూచించారు. అడిషనల్ ఎస్పీలు రాజేశ్ మీనా, అవినాశ్ కుమార్, తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.