
నిర్మల్, వెలుగు: టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో నిర్మల్‌కు చెందిన ఎర్రవోతు సాయి ప్రణయ్ సత్తా చాటాడు. 455 మార్కులు సాధించారు. ప్రభుత్వ టీచర్ ఎర్రవోతు ముత్తన్న–శ్యామల కొడుకు సాయి ప్రణయ్ హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశాడు. మొదటిసారి గ్రూప్ 1 పరీక్షకు హాజరై జిల్లా టాపర్‌గా నిలిచాడు. తన కొడుకుకు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం లభిస్తుందని తండ్రి ముత్తన్న ఆనందం వ్యక్తం చేశారు. స్థానికులు సాయి ప్రణయ్‌ని అభినందించారు.
గ్రూప్ 2లో శివకృష్ణకు 19వ ర్యాంక్
ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన శ్రీరామ్ శివకృష్ణ 412.050 మార్కులతో గ్రూప్ 2లో రాష్ట్రంలో 19 ర్యాంకు, జోన్లో 4వ ర్యాంకు సాధించాడు. జిల్లా కేంద్రానికి చెందిన శ్రీరామ్ సత్యనారాయణ–వాణిశ్రీ దంపతుల కొడుకు జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ లో చదివి ట్రిపుల్ ఐటీ లో సీటు సంపాదించారు. గతేడాది ప్రకటించిన గ్రూప్ 4 ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఆడిట్ సెక్షన్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. కౌటాల మండలం తలోడి గ్రామానికి చెందిన మండల సాయిరాం గౌడ్ గ్రూప్ 2 ఫలితాల్లో స్టేట్ లెవల్లో 191 ర్యాంక్ సాధించాడు. సాయిరా ప్రస్తుతం బెజ్జూర్ మండలం మొగవెల్లి పంచాయితీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తూనే గ్రూప్2కు ప్రిపేర్ అయ్యి సత్తా చాటాడు.