ఆదిలాబాద్ జిల్లా: నిర్మల్ జిల్లా కేంద్రంలోని గ్రిల్ నైన్ హోటల్లో భోజనం చేసిన బోత్ మండలం సెయింట్ థామస్ స్కూల్ స్టాఫ్ అస్వస్థతకు లోనయ్యారు. బైగా అనే యువతి ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఈ ఘటనపై యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే హోటల్లో సోమవారం రాత్రి భోజనం చేసిన 20 మంది అస్వస్థతకు లోనయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ హోటల్ను అధికారులు సీజ్ చేశారు.
ఈ హోటల్లో మండీ బిర్యానీ తిన్న పలువురికి ఫుడ్ పాయిజన్ అయి చికిత్స పొందుతున్నారు. నిర్మల్ టౌన్ ఖానాపూర్ రోడ్డులోని గ్రిల్ హోటల్లో ఆదివారం రాత్రి ఖానాపూర్కు చెందిన కొందరు.. నిర్మల్కు చెందిన అస్లాం, హుస్సేన్, షేక్ బాబా, షేక్ జాకీర్, సైఫ్ మండీ చికెన్ బిర్యానీ తిన్నారు.
13 మందికి ఫుడ్ పాయిజన్ అయి.. వాంతులు, విరేచనాలు కావడంతో నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరు సోమవారం మధ్యాహ్నం కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. మరో ఆరుగురు చికిత్స పొందుతున్నారు. చికెన్ బిర్యానీ తినడంతోనే ఫుడ్ పాయిజన్ అయినట్టు బాధితులు, వైద్య సిబ్బంది తెలిపారు.