
నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ లీడర్లు, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డితో పాటు లైబ్రరీ మాజీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నేరెళ్ల వేణుతో పాటు మరికొందరు నాయకులు కాంగ్రెస్‌లో చేరారు.
శనివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలవడంతో ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. మాజీమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి అత్యంత సన్నిహితులైన వీరు శుక్రవారం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి శనివారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో గట్టి పట్టున్న నేతలంతా కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశంగా మారింది.