పోలీస్ జాగిలం హంటర్ మృతి..నివాళి అర్పించిన ఎస్పీ జానకి షర్మిల 

పోలీస్ జాగిలం హంటర్ మృతి..నివాళి అర్పించిన ఎస్పీ జానకి షర్మిల 

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో పోలీస్ శాఖకు విశేష సేవలందించిన హంటర్ అనే జాగిలం అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. చాలా ఏళ్లుగా హంటర్ పలు కేసుల్లో కీలక పాత్ర పోషించిందని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో దాని భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి, నివాళి అర్పించారు. పోలీసు అధికారులు, సిబ్బంది రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఎస్పీ మాట్లాడుతూ.. బెల్జియం మలినోస్ జాతికి చెందిన హంటర్ మార్చి11, 2021న జన్మించిందని, రంగారెడ్డి జిల్లాలోని కెనైన్ ట్రైనింగ్ సెంటర్ ఐఐటీఏ మొయినాబాద్‌లో 8 నెలల శిక్షణ పూర్తి చేసుకుందని తెలిపారు.

నిర్మల్ జిల్లాలో ఫిబ్రవరి, 2022 నుంచి విధుల్లో చేరిందన్నారు.  పలు జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లలో పాల్గొని, ప్రతిభ చాటిందని పేర్కొన్నారు. పోలీస్​ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. అడిషనల్ ఎస్పీ రాజేశ్​మీనా, ఇన్​స్పెక్టర్లు ప్రేమ్ కుమార్, కృష్ణ,  ఆర్ఐలు రామ్​నిరంజన్, శేఖర్, రమేశ్, ఎస్ఐ లింబాద్రి, ఆర్ఎస్ఐలు, జాగిలంల సంరక్షకులు, పో లీస్ సిబ్బంది పాల్గొన్నారు