నిర్మల్, వెలుగు: డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన ఇద్దరూ మహిళా ఆటో డ్రైవర్లకు మంగళవారం నిర్మల్ ఆర్డీవో దుర్గాప్రసాద్ లైసెన్సులు జారీ చేశారు. లక్ష్మణచాంద మండలం బాబాపూర్‌కు చెందిన ఎన్.కాశవ్వ, అదే మండలం చామనపల్లికి చెందిన బి.మంజుల ఇటీవలే ఆటో డ్రైవింగ్ టెస్ట్ పాసయ్యారు.
దీంతో వీరికి ఆర్టీవో ఆఫీస్‌లో ఆర్టీవో స్వయంగా లైసెన్సులు అందజేశారు. ఎంవీఐ ఎ.మహేందర్, ఏఎంవీఐ మూర్జా అలీ, సిబ్బంది పాల్గొన్నారు.