కుంభమేళాలో గుండెపోటుతో నిర్మల్ వాసి మృతి

కుంభమేళాలో గుండెపోటుతో నిర్మల్ వాసి మృతి

నిర్మల్, వెలుగు : కుంభమేళాకు వెళ్లిన నిర్మల్ జిల్లా వాసి గుండెపోటుతో మృతిచెందిన ఘటన యూపీలోని కాశీ( వారణాసి)లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. నిర్మల్ కు చెందిన ఫార్మసిస్ట్ ఫణింద్ర (55) ఫ్రెండ్స్ తో కలిసి బస్సులో కుంభమేళాకు వెళ్లారు.  

మంగళవారం మధ్యాహ్నం కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్న కొద్దిసేపటికి ఫణీంద్రకు గుండెపోటు వచ్చింది. ఫ్రెండ్స్ సీపీఆర్ చేసినా ఫలితం లేదు. అప్పటికే అతడు చనిపోయాడు.   మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు.