నిర్మల్ మెప్మాలో రూ.2 కోట్ల స్కామ్

నిర్మల్ మెప్మాలో రూ.2 కోట్ల స్కామ్
  • మహిళా పొదుపు సంఘాల నిధులు స్వాహా 
  • జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేకంగా విచారణ

నిర్మల్, వెలుగు: నిర్మల్ మున్సిపల్ పరిధిలోని మెప్మా లో  రూ. కోట్లలో స్కామ్ జరిగినట్టు పోలీసుల ఎంక్వైరీలో వెల్లడైంది. కొంతకాలంగా మెప్మాకు చెందిన ఆర్సీలు మహిళా పొదుపు సంఘాల పేరిట రూ. 2  కోట్లకుపైగా రుణాలు తీసుకుని పక్కదారి పట్టించినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా విచారణ చేసే బాధ్యతలను ముధోల్ ఎస్ఐ సంజీవ్ కు అప్పగించారు.  దీంతో మంగళవారం ఎస్ఐ సంజీవ్ నిర్మల్ మున్సిపాలిటీలోని మెప్మా ఆఫీసులో తనిఖీలు నిర్వహించారు. 

రికార్డులను పరిశీలించి రూ. 2 కోట్లకుపైగా  అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. దీంతో రికార్డులను స్వాధీనం చేసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని ఎస్ఐ సంజీవ్ తెలిపారు. విచారణ అనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకునేందుకు సిఫారసు చేయనున్నట్లు ఆయన చెప్పారు.