కేదార్ ఖండ్ శిఖరం అధిరోహించిన నిర్మల్ విద్యార్థి

కేదార్ ఖండ్ శిఖరం అధిరోహించిన నిర్మల్ విద్యార్థి

 నిర్మల్, వెలుగు: నిర్మల్ పట్టణానికి చెందిన అడ్వకేట్ లక్కాకుల తుకారాం కుమారుడు లక్కాకుల ఆదిత్య హిమాలయ పర్వతాలలోని కేదార్ ఖండ్ శిఖరాన్ని అధిరోహించి రికార్డ్ సృష్టించారు.  ఆదిత్య 12,500 అడుగుల ఎత్తున ఉన్న ఈ శిఖరాన్ని అధిరోహించేందుకు 15 రాష్ట్రాలకు చెందిన 300 మందితో కూడిన బృందంతో బయలుదేరాడు.

.వీరిలో కేవలం ఏడుగురు మాత్రమే శిఖరం పైవరకు చేరుకున్నారు. ఇందులో ఆదిత్య మిగతా వారి కన్నా ముందుగా అధిరోహించి మొదటి స్థానంలో నిలిచాడు. ఆదిత్య పంజాబ్‌లోని ఎల్‌పీయూ యూనివర్సిటీలో ఎంసీఏ చదువుతున్నాడు.