నిర్మల్, వెలుగు: జేఈఈ మెయిన్స్ పరీక్షలో నిర్మల్‌కు చెందిన పలువురు స్టూడెంట్లు అత్యధిక మార్కులతో మెరుగైన పర్సంటైల్ సాధించారు. జిల్లా కేంద్రంలోని విజయనగర్ కాలనీకి చెందిన గవర్నమెంట్ టీచర్లు పోతుల్వార్ సురేశ్, స్వప్న కొడుకు సృజన్ కుమార్ 99.927 పర్సంటైల్‌తో జిల్లా టాపర్‌గా నిలిచాడు. ప్రియదర్శిని నగర్ లో నివసించే అట్టోలి సంజీవ్ కుమార్, ప్రభ దంపతుల కొడుకు రుతిక్ కుమార్ 99.895 సాధించాడు.
గవర్నమెంట్ టీచర్ నహీద్ పాషా కొడుకు సయ్యద్ రెహాన్ రియాజ్ 99.880, ప్రియదర్శి నగర్‌కు చెందిన కోటగిరి వరప్రసాద్, శ్రీలత కొడుకు అభినవ్ 99.17 పర్సంటైల్ సాధించి సత్తా చాటారు. ఐఐటీలో సీటు సాధించడమే ధ్యేయమని వారు పేర్కొన్నారు.