సూర్యాపేట కలెక్టరేట్‌‌‌‌కు పెట్రోల్‌‌‌‌తో వచ్చిన మహిళ

సూర్యాపేట, వెలుగు:  కార్మికశాఖలో డెత్‌‌‌‌ ఇన్స్యూరెన్స్​ క్లెయిమ్​ కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు దురుద్దేశంతో అందకుండా ఆపుతున్నారని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురానికి చెందిన బుడిగ నిర్మల శనివారం కలెక్టరేట్​లో ఆత్మహత్య చేసుకునేందుకు పెట్రోల్‌‌‌‌ బాటిల్‌‌‌‌తో వచ్చింది. గేటు వద్దే గమనించిన పోలీసులు బాటిల్‌‌‌‌ లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. తర్వాత అడిషనల్ కలెక్టర్‌‌‌‌ వెంకట్‌‌‌‌రెడ్డిని కలిసిన బాధితురాలు తన గోడు వెల్లబోసుకుంది. ఐలాపురానికి చెందిన బాధితురాలి మామ బుడిగ వెంకటయ్య భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసేవాడు. 

ఇతడికి లేబర్‌‌‌‌ కార్డు కూడా ఉంది. ఇతడు చనిపోగా బీమా కోసం నిర్మల 18 నెలల క్రితం దరఖాస్తు చేసుకుంది. అప్పటినుంచీ డబ్బుల కోసం లేబర్ ఆఫీసు చుట్టూ తిరుగుతోంది. అయినా సూర్యాపేట అసిస్టెంట్‌‌‌‌ లేబర్‌‌‌‌ ఆఫీసర్​ డబ్బులు అందకుండా అడ్డుపడుతున్నాడని ఆరోపించింది. దీంతో  విసుగు చెందిన ఆమె శనివారం కలెక్టరేట్​లో ఆత్మహత్య చేసుకోవడానికి పెట్రోల్​బాటిల్​తో వచ్చింది. స్పందించిన అడిషనల్ కలెక్టర్‌‌‌‌ ఆమె దరఖాస్తును పరిశీలించి బీమా అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.