ఒక బ్యాంక్ అకౌంట్‌‌కు నలుగురు నామినీలు

ఒక బ్యాంక్ అకౌంట్‌‌కు నలుగురు నామినీలు
  • బ్యాంకింగ్ సవరణ బిల్లును పార్లమెంట్‌‌లో  ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌‌

న్యూఢిల్లీ: ఒక బ్యాంక్ అకౌంట్‌‌కు ఒకేసారి నలుగురి వరకు నామినీలను పెట్టుకోవడానికి వీలుకల్పించే  బ్యాంకింగ్ చట్టం ( సవరణ), 2024 బిల్లును   ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ శుక్రవారం  పార్లమెంట్‌‌లో  ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం ఒక నామినీనే పెట్టుకోవచ్చు.  డిపాజిట్లు,  సేఫ్ కస్టడీలోని ఆర్టికల్స్‌‌, సేప్టీ లాకర్స్‌‌  డిపాజిటర్లు చనిపోయాక వీరి లీగల్ వారసులకు ఈజీగా చేరేందుకు తాజా ప్రపోజల్ సాయపడుతుందని అంచనా. నామినీలను ఒక ఆర్డర్‌‌‌‌లో పెడతారు.  మొదటి నామినీ సంబంధిత ఫండ్స్​ను అందుకోలేకపోతే ఆర్డర్‌‌‌‌లోని రెండో నామినీని సంప్రదిస్తారు. 

అలా లిస్టులోని నామినీలకు ఆర్డర్ బట్టి ప్రయారిటీ ఇస్తారు. క్లెయిమ్‌‌ చేసుకోని డివిడెండ్లు, షేర్లు,  వడ్డీ లేదా బాండ్లను  ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్‌‌కు కేటాయించాలని ఈ బిల్లులో ఉంది. ఇన్వెస్టర్లు ట్రాన్స్‌‌ఫర్ లేదా రిఫండ్‌‌ను ఈ ఫండ్‌‌ నుంచి కోరొచ్చు. షేర్‌‌‌‌హోల్డింగ్‌‌లో ‘సబ్‌‌స్టాన్షియల్‌‌ (కీలకమైన) ఇంట్రెస్ట్‌‌’ నిర్ణయించే లిమిట్‌‌ను ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల నుంచి రూ.2 కోట్లకు పెంచాలని ప్రపోజల్ ఉంది.