న్యూఢిల్లీ: జీఎస్‌టీ తీసుకొచ్చాక ట్యాక్స్ కట్టేవాళ్లు డబుల్ అయ్యారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రస్తుతం ట్యాక్స్ పేయర్ల సంఖ్య సుమారు 1.28 కోట్లకు చేరుకుందని చెప్పారు. జీఎస్‌టీని తీసుకొచ్చి నాలుగేళ్లు పూర్తి కావడంతో గురువారం ట్యాక్స్ అధికారులకు ఆమె లెటర్స్ రాశారు. జీఎస్‌టీ తీసుకొచ్చాక ట్యాక్స్ కలెక్షన్ పెరిగిందని పేర్కొన్నారు. గత ఎనిమిది నెలల్లోనూ జీఎస్‌టీ కలెక్షన్ రూ. లక్ష కోట్ల మార్క్‌ను క్రాస్ చేసిందని, ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ. 1.41 లక్షల కోట్లతో రికార్డ్‌ను క్రియేట్ చేసిందని పేర్కొన్నారు. ట్యాక్స్ ఫ్రాడ్స్‌ను గుర్తించడంలోనూ, ట్యాక్స్ సిస్టమ్‌ను సులభం చేయడంలో మంచి పనితీరు కనబడుతోందని అని చెప్పారు. కాగా, జీఎస్‌టీ తీసుకురాక ముందు దేశంలో ట్యాక్స్ పేయర్ల సంఖ్య 66.25 లక్షలుగా ఉండేది. ‘ఇండియాలాంటి పెద్ద దేశంలో ఏ సంస్కరణనైనా తీసుకురావడం చాలా కష్టం. ట్యాక్స్ పేయర్లకు, సిటిజన్స్‌కు జీఎస్‌టీపై ఉన్న న్యాయపరమైన ఆందోళనలను తొలగించడంలో జీఎస్‌టీ కౌన్సిల్ మంచి పనితీరు కనబరిచింది. ట్యాక్స్ పేయర్లకు, ముఖ్యంగా చిన్న బిజినెస్‌లకు ట్యాక్స్ భారాన్ని జీఎస్‌టీ తగ్గించింది. కామన్ మ్యాన్‌పై పన్ను భారాన్ని కూడా తగ్గించగలిగింది’ అని సీతారామన్ పేర్కొన్నారు.