కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2025-26 బడ్జెట్.. విక్షిత్ భారత్, జీరో పావర్టీ (పేదరికం సున్నాకు తీసుకురావడం) లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ బడ్జెట్ లో మిడిల్ క్లాస్ (మధ్య తరగతి), ఇన్ ఫ్రా (మౌళిక సదుపాయాలు) ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
అదే విధంగా ఈ బడ్జెట్ టాప్ ప్రయారిటీ యువత, రైతులు, మహిళలు టాప్ ప్రయారిటీ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అదే విధంగా చిన్న తరహా పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు.
Also Read :- కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్
రైతుల కోసం కొత్త స్కీమ్ తీసుకొస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. పీఎం ధన్ ధాన్య యోజన అనే పథకాన్ని ప్రయోగాత్మకంగా 100 జిల్లాల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ స్కీమ్ లో భాగంగా పప్పు ధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళికను అమలు చేయనున్నారు. వ్యవసాయ ఉత్పత్తి, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా పేర్కొన్నారు. 1.7 కోట్ల రైతులకు లబ్ది కలిగేలా స్కీమ్ రూపొందించినట్లు తెలిపారు.