రాష్ట్రాలు ఒప్పుకుంటే వెంటనే జీఎస్‌‌‌‌టీ కిందికి పెట్రోల్‌‌‌‌

రాష్ట్రాలు ఒప్పుకుంటే వెంటనే జీఎస్‌‌‌‌టీ కిందికి పెట్రోల్‌‌‌‌
  • రాష్ట్రాలు ఒప్పుకుంటే వెంటనే జీఎస్‌‌‌‌టీ కిందికి పెట్రోల్‌‌‌‌
  •     ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్‌‌‌‌

న్యూఢిల్లీ: పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌ను జీఎస్‌‌‌‌టీ కిందకు తీసుకురావడానికి జీఎస్‌‌‌‌టీ చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నాయని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ శుక్రవారం అన్నారు. ఇది జరగాలంటే జీఎస్‌‌‌‌టీ కౌన్సిల్‌‌‌‌లో  రాష్ట్రాలన్నీ కలిసి కట్టుగా ముందుకు రావాలని పేర్కొన్నారు. ప్రస్తుతం పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌పై  వ్యాట్ పడుతోంది.   ‘ వాళ్లు (రాష్ట్రాలు) రేటును ఫిక్స్ చేయాలని అనుకుంటే, జీఎస్‌‌‌‌టీ కిందకు పెట్రోలియం ప్రొడక్ట్‌‌‌‌లను తీసుకురావాలని కలిసి కట్టుగా నిర్ణయించుకొని ముందుకు రావాలి. వస్తే వెంటనే అమల్లోకి తెస్తాం’ అని ఓ ఇంగ్లీష్ ఛానెల్‌‌‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీతారామన్ పేర్కొన్నారు. 

ప్రస్తుతం రాష్ట్రాలను బట్టి  పెట్రోలియం ప్రొడక్ట్‌‌‌‌లపై ట్యాక్స్ డిఫరెంట్‌‌‌‌గా ఉంది.  పెట్రోల్‌‌‌‌, డీజిల్‌‌‌‌ను జీఎస్‌‌‌‌టీ కిందకు తీసుకొస్తే రాష్ట్రాలు రెవెన్యూ లాస్ అవుతాయి.