శ్రీలంక క్రికెట్‌లో డోపింగ్ కలకలం రేగింది. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించడంతో లంక వికెట్ కీపర్/బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా(Niroshan Dickwella) ఆ దేశ క్రికెట్ బోర్డు సస్పెన్షన్ వేటు వేసింది. తక్షణమే ఈ నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది.
ఇటీవల ముగిసిన లంక ప్రీమియర్ లీగ్‌లో ప్రపంచ డోపింగ్ నిరోధక మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగిన పరీక్షలో డిక్వెల్లా విఫలమయ్యాడని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ అతను అన్ని రకాల క్రికెట్‌ల నుండి సస్పెండ్ చేయబడతాడని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. మున్ముందు డిక్వెల్లా విచారణను ఎదుర్కోనున్నాడు. అనంతరం ఎంత కాలం నిషేధం అనే దానిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Sri Lanka Cricket Suspends Niroshan Dickwella Following Alleged Anti-Doping Violation#sportspavilionlk #niroshandickwella #srilanka pic.twitter.com/WUmbZc8ZyN
— DANUSHKA ARAVINDA (@DanuskaAravinda) August 16, 2024
లంక ప్రీమియర్ లీగ్‌లో కెప్టెన్..
డిక్వెల్లా ఇటీవల ముగిసిన లంక ప్రీమియర్ లీగ్(LPL 2024)లో గాలే మార్వెల్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అతని నాయకత్వంలో, గాలే జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి.. ఫైనల్ వరకూ చేరింది. అయితే, తుది పోరులో జఫ్నా చేతిలో పరాజయం పాలైంది. 31 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. లంక జట్టుకు మూడు ఫార్మాట్లలోనూ వికెట్ కీపర్‌గా పనిచేశాడు. టెస్టుల్లో 2757, వన్డేల్లో 1604, టీ20ల్లో 480 పరుగులు చేశాడు.