NishadhYusuf: 43 ఏళ్ల కంగువ ఎడిటర్.. ఇంట్లో శవమై అలా ఎలా?

NishadhYusuf: 43 ఏళ్ల కంగువ ఎడిటర్.. ఇంట్లో శవమై అలా ఎలా?

ప్రముఖ ఫిల్మ్ ఎడిటర్ నిషాద్ యూసుఫ్ (43)(Nishadh Yusuf) అక్టోబర్ 30, బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తమిళ, మలయాళ సినీ పరిశ్రమలో ఎడిటర్గా మంచి గుర్తింపు తెచ్చుకుని.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో కొచ్చిలోని తన ఫ్లాట్‌లో నిషాద్ శవమై కనిపించడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రస్తుతం నిషాద్ ఎడిటర్గా పనిచేసిన సూర్య కంగువ మూవీ నవంబర్ 14న రిలీజ్ కానుంది. కాగా ఈ మూవీ మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న సమయంలోనే అతని ఆకస్మిక మరణ వార్త.. కంగువ మూవీ యూనిట్ని షాక్కి గురి చేస్తోంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఆడియో లాంచ్ కార్యక్రమంలో కూడా నిషాద్ పాల్గొన్నారు. అక్కడ ఈవెంట్లో అందరితోను ఎంతో సరదాగా గడిపారు.

అలాగే కంగువ పాన్ ఇండియా ప్రమోషన్స్ లోను నిషాద్ ఎంతో చురుకుగా పాల్గొంటూ.. సినిమా రిలీజ్ కోసం ఎదురుచూసారు. కానీ, హఠాత్తుగా తన ఇంట్లోనే శవమై కనిపించడంతో.. అలా ఎలా చనిపోయాడనే అనుమానాలు నెలకొన్నాయి. ప్రస్తుతం నిషాద్ మృతికి గల కారణాలను కేరళ పోలీసులు ఇంకా ప్రకటించలేదు. ఈ మరణంపై దర్యాప్తు చేస్తున్నారు. 

ప్రస్తుతం అతను చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతున్నాయి. అందులో ముఖ్యంగా కంగువ మూవీ. ఈ మూవీతో నిషాద్కు పాన్ ఇండియా స్థాయిలో మరింత గుర్తిపు వస్తుందని మేకర్స్ అందరూ భావించారు. కానీ, ఇలా సడెన్గా నిషాద్ ఈ లోకాన్ని విడిచివెళ్లడంతో కంగువ టీంని షాక్ గురిచేసింది. 

నిషాద్ వరుస సినిమాలు చూసుకుంటే.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న బాజూకా షూటింగ్లో ఉండగా.. నటుడు, దర్శకుడు RJ బాలాజీ-సూర్య కాంబోలో వస్తోన్న మూవీకి పనిచేస్తున్నాడు. అలాగే మోహన్ లాల్ కొత్త మూవీకి కూడా నిషాద్ ఎడిటర్గా సెలెక్ట్ అయ్యాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ 43 ఏళ్ల కంగువ ఎడిటర్ సడెన్ గా ఇంట్లో శవమై అలా ఎలా ఉంటాడు అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మలయాళ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా పనిచేసిన నిషాద్.. మమ్ముట్టి నటించిన 'ఉండా', టోవినో థామస్ 'తల్లుమాల్లా ' 'వన్',ఆపరేషన్ జావా వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన 'సౌదీ వెల్లక్క'తో తన అద్భుతమైన ఎడిటింగ్ కట్స్ తన ఖ్యాతిని మరింత రెట్టింపు చేసుకున్నాడు. తన సినిమాలలో సూపర్ హిట్‌గా నిలిచిన యాక్షన్ 'తల్లుమాల్లా' సినిమాకు గాను నిషాద్‌కి కేరళ రాష్ట్ర ఉత్తమ ఎడిటర్ అవార్డు కూడా లభించింది. కాగా నిషాద్ మృతికి ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (ఫెఫ్కా) డైరెక్టర్స్ యూనియన్తో పాటు కంగువ యూనిట్ సంతాపం ప్రకటించారు.