బిగ్ షాక్: సూర్య 'కంగువ' మూవీ ఎడిటర్‌ అనుమానాస్పద మృతి

బిగ్ షాక్: సూర్య 'కంగువ' మూవీ ఎడిటర్‌ అనుమానాస్పద మృతి

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘కంగువ’(Kanguva). మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న కంగువ మూవీ యూనిట్కి బిగ్ షాక్ తగిలింది. ఈ సినిమాకు ఎడిటర్గా పని చేసిన నిషాద్ యూసుఫ్ (Nishadh Yusuf) మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. 

ప్రముఖ చిత్రాలకు ఫిల్మ్ ఎడిటర్గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న నిషాద్ యూసుఫ్ (అక్టోబర్ 30) బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కొచ్చిలోని పనంపిల్లి నగర్‌లోని అతని అపార్ట్‌మెంట్‌లో ఇవాళ తెల్లవారుజామున 2 గంటలకు మరణించినట్లు సమాచారం. ఆయన సొంత ఫ్లాట్ లో నిషాద్ మృతి చెంది విగత జీవిగా పడి ఉండడంతో.. వెంటనే హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

ALSO READ : KA Movie: కిరణ్ అబ్బవరం 'క' మూవీకి మొదట అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా ?

43 సంవత్సరాలు వయస్సులోనే నిషాద్ అనుమానాస్పదంగా చనిపోవడం పట్ల కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా ప్రస్తుతం నిషాద్ యూసుఫ్ మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిషాద్ యూసుఫ్‌కు భార్య, ఒక కుమారుడు మరియు కుమార్తె ఉన్నారు.

నిషాద్ సినిమాల విషయానికి వస్తే.. థొవినో థామస్ నటించిన తల్లుమాల్లా, చావెర్​, ఉండా, సౌదీ వెళ్లాక, వన్​, ఆపరేషన్ జావా, బజూక, కంగువ సినిమాలకు ఎడిటర్​గా పని చేశారు. తల్లుమాల్లా సినిమాకు గానూ నిషాద్​ బెస్ట్ ఎడిటర్​గా నేషనల్​ అవార్డ్​ను అందుకున్నారు. త్వరలోనే మమ్ముట్టి నటించిన 'బజూక', సూర్య నటించిన 'కంగువ' సినిమాలు రిలీజ్ కానున్నాయి. కాగా కంగువ మూవీ వచ్చేనెల నవంబర్ 14న పాన్ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌గా విడుదల కానుంది.

ఇకపోతే కంగువ మూవీతో నిషాద్ కు పాన్ ఇండియా స్థాయిలో మరింత గుర్తిపు వస్తుందని మేకర్స్ అందరూ భావించారు. కానీ, ఇలా నిషాద్ సడెన్ గా ఈ లోకాన్ని విడిచివెళ్లడంతో కంగువ టీంకి ఎంతో బాధ కలిగిస్తోంది.కాగా నిషాద్ మృతికి ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (ఫెఫ్కా) డైరెక్టర్స్ యూనియన్ తో పాటు కంగువ యూనిట్ సంతాపం ప్రకటించారు.