జిమ్నాస్టిక్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌కు హైదరాబాద్ అథ్లెట్.. నిషికా అగర్వాల్‌‌‌‌

జిమ్నాస్టిక్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌కు హైదరాబాద్ అథ్లెట్.. నిషికా అగర్వాల్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌: తెలంగాణ జిమ్నాస్ట్‌‌‌‌ నిషికా అగర్వాల్‌‌‌‌.. ఎఫ్‌‌‌‌ఐజీ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌కు సెలెక్ట్‌‌‌‌ అయ్యింది. ఇవాళ్టి (మార్చి6) నుంచి 9వ తేదీ వరకు అజర్‌‌‌‌బైజాన్‌‌‌‌లోని బాకులో జరిగే ఈ టోర్నీలో నిషిక.. ఇండియాకు ప్రాతినిధ్యం వహించనుంది. 

హైదరాబాద్‌‌‌‌కు చెందిన నిషిక.. నేషనల్‌‌‌‌, ఇంటర్నేషనల్‌‌‌‌ టోర్నీల్లో నిలకడగా రాణిస్తోంది. గాడియం స్పోర్టోపియా స్పోర్ట్స్‌‌‌‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. ఈ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో నిషిక మెరుగైన పెర్ఫామెన్స్‌‌‌‌ చూపెడుతుందని తెలంగాణ జిమ్నాస్టిక్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ఆశాభావం వ్యక్తం చేసింది. 

ప్రపంచ వ్యాప్తంగా టాప్‌‌‌‌ అథ్లెట్లు బరిలోకి దిగుతున్న ఈ టోర్నీలో గట్టి పోటీ ఉంటుందని, అయినప్పటికీ నిషిక సత్తా చూపెడుతుందన్నారు.